24 ఏళ్ల అబ్బాస్ సబానీ80మందిని చంపాడు..!
- November 26, 2016
ఇరాక్‌లోని కిర్కుక్ నగరం... 24 ఏళ్ల అబ్బాస్ సబానీ చేతిలో సంకెళ్లతో అమాయక ముఖంతో ఉన్నాడు.. చూపరులకు ఏదో చిన్న నేరం చేసి వుంటాడనిపిస్తోంది... అయితే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో కలిసి నగరంపై జరిపిన దాడిలో దాదాపు 80 మంది చనిపోవడానికి కారణం అతనే అని కుర్దిష్ వర్గాలు తెలిపాయి.డబ్బుకు ఆశపడి.. ఈ దాడిలో కిర్కుక్ నగరం వణికిపోయింది. ఎందుకు ఈ పని చేశావని సబానీని ప్రశ్నిస్తే కేవలం డబ్బుకు ఆశపడే చేశానని అతను బదులివ్వడం అందర్ని నిర్ఘాంతపరిచింది. కిర్కుక్ నగరం సమీపంలోని గ్రామంలో తన నివాసం వున్నట్టు పేదరికం కారణంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు చెప్పిన పనిని అంగీకరించినట్టు వెల్లడించాడు.అయితే ఆత్మాహుతికి పాల్పడేందుకు భయం వేయడంతో మిషన్గన్తో కాల్పులు జరిపినట్టు వెల్లడించాడు. దాడిలో చనిపోయినా కుటుంబసభ్యులకు ఎటువంటి లోటు రాకుండా చూస్తామని ఐఎస్ వర్గాలు చెప్పడంతో అనేకమంది యువకులు కిర్కుక్ నగరంపై దాడులు చేసినట్టు తెలిపాడు. ఆత్మాహుతి దాడితో స్వర్గం లభిస్తుందని ఐఎస్ సిద్ధాంతకర్తలు బోధించారని ఆ బోధనలతో తన స్నేహితులు సూసైడ్ జాకెట్లు ధరించి దాడుల్లో పాల్గొన్నట్టు వెల్లడించాడు. దాదాపు వందమంది దాడులకు పాల్పడగా 20 మంది పేలుడు పదార్ధాలు కలిగిన జాకెట్లు ధరించినట్టు చెప్పాడు.వీరిలో అనేకమంది మరణించగా తాను విచక్షణారహితంగా ప్రజలపై కాల్పులు జరిపినట్టు అంగీకరించాడు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







