సౌదీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎన్నికలలో మహిళలు
- September 02, 2015
డ్రైవింగ్ సహా అనేక విషయాలలో మహిళలపై నిషేధం ఉన్న ముస్లిం రాజ్యమైన సౌదీలో మహిళలు స్థానిక ఎన్నికలలో నిలబాడవచ్చు, పాల్గొనవచ్చనే చారిత్రాత్మక నిర్ణయం వెలువడింది! రానున్న డిసెంబరులో జరగనున్న స్థానిక ఎన్నికలకు అందరు మహిళలే ఉండే ప్రత్యేక ఎలక్షన్ సెంటర్ల వద్ద మహిళలు రిజిస్ట్రేషన్ చేయించుకోడoతో ఈ మార్పు మొదలైంది. దివంగత అధినేత కింగ్ అబ్దుల్లా మహిళలకు ఓటు వేసేందుకు, ఎన్నికలలో నిలబడేందుకు హక్కు కల్పించారనే సంగతి విదితమే; ఇప్పటికి ఇంచుమించు 200 మంది మహిళలు రిజిస్ట్రేషన్లు చేసుకోడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలియవస్తోంది. దేశంలోని మొత్తం 284 మునిసిపాలి టీలలోని 1263 పోలింగ్ స్టేషన్లలో, 424 మహిళలకు కేటాయించబడ్డాయి. కాగా, వోటర్ల రెజిస్ట్రేషన్ సెప్టెంబర్ 14 న, అభ్యర్ధుల రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 17న ముగు స్తుంది. ఐతే కరడుగట్టిన చాందసవాదుల నుండి మహిళలకు సమాన హక్కులివ్వడం సరికాదనే తీవ్ర విమర్శలు, బెదిరింపులు షరా మామూలే!
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







