స్వల్పంగా పడిన పసిడి ధర
- September 02, 2015
మూడు రోజులుగా పైపైకి పోతున్న బంగారం ధర ఈ రోజు స్వల్పంగా తగ్గింది. మంగళవారం రూ.27,000మార్కును చేరిన బంగారం ధర ఈ రోజు రూ.60 తగ్గింది. కీలక సమయాల్లో కొనుగోలుదారుల నుంచి మద్దతు లభించకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దేశీయంగా ఈ లోహం ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.2శాతం తగ్గి 1,138 అమెరికన్ డాలర్లకు చేరింది.ఈ రోజు బంగారం దారిలోనే వెండి సైతం పయనించింది. రూ.150 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.35,000కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో ఈ లోహం ధర తగ్గిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 0.5శాతం తగ్గి 14.54 అమెరికన్ డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







