సెప్టంబరు నుండి కతార్ లో 9 కొత్త ప్రైవేట్ పాఠశాలలు

- September 02, 2015 , by Maagulf
సెప్టంబరు నుండి కతార్ లో 9 కొత్త ప్రైవేట్ పాఠశాలలు

తమ పిల్లలకు ఇంకా స్కూలు సీటు పొందని తల్లిదండ్రులకు శుభవార్త! సుప్రీం ఎడుకేషన్ కౌన్సిల్ యొక్క ప్రైవేట్ స్కూలు వ్యవహారాల అసిస్టెంట్ డైరెక్టర్ ఐషా సలేహ్ అల్ హషేమీ, 9 కొత్త స్కూళ్ళు ప్రభుత్వం వారి అంతిమ ఎనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయని, వీని వలన 5000 కొత్త సీట్లు లభిస్తాయని, ఇవి బ్రిటిష్ కరిక్యులమ్ ను అవలంభిస్తాయని, 2015-16 విద్యా సంవత్సరంలో ఇవి ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఐతే, వీని పేర్లు చెప్పడానికి నిరాకరించారు. ఒక ప్రశ్నకు సమాధానంగా, ప్రస్తుతం బ్రిటిష్, అమెరికన్ పాఠశాలలు సరిపోతున్నాయని, కానీ ఇండియా, సీరియా, ఈజిప్టు వంటి పాఠశాలలకు మాత్రం కొరత ఉందని ఆయన అంగీకరించారు.

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com