బయటి దేశాల నుండి ఫోన్ కాల్స్? కాస్త ఆలోచించండి!
- September 02, 2015
బయటి దేశాల నుండి వచ్చే అపరిచిత ఫోన్ కాల్స్ విషయంలో కాస్త అప్రమత్తంగానే ఉండాలని దుబాయి పోలీస్ అల్ అమీన్ సర్వీస్ వారి మీడీయా బ్యూరో ప్రజలను హెచ్చరించింది. ఇటువంటి కాల్స్ కు తమ పేరు, వయస్సు, ఆర్ధిక విషయాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వరాదని, ఈ హెచ్చరిక సోషల్ మీడీయా సైట్లు, ఈ- మెయిల్ వంటి ఇతర స్మార్ట్ సర్వీసులకు కూడా వర్తిస్తుందని వారు తెలియజేశారు. ఎవరైన అటువంటి అనుమానాస్పద కాల్స్‌ను అందుకుంటే, ఆ సమాచారాన్ని, అల్ అమీన్ వారికి ఫోన్ నంబరు మరియు ఫ్యాక్స్ నంబరు -(00971) 8004888, మెయిల్ [email protected],, ఎస్. ఎం. ఎస్. నంబరు 4444, ద్వారా మాత్రమే కాక, వెబ్ సైట్ http://www.alameen.gov.ae/ మరియు ఇతర సోషల్ మీడియా వారి ద్వారా కూడా సంప్రదించి, సమాచారమివ్వాలని అధికారులు కోరారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







