ముగిసిన 'అమ్మ' శకం
- December 05, 2016
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి.. పురచ్చితలైవి జయలలిత (68) ఇక లేరు.కోట్లాది అభిమానులను.. పార్టీ కార్యకర్తలను శోకసంద్రంలో ముంచుతూ మరలిరాని లోకాలకు తరలిపోయారు. మరి కొద్దిసేపటిలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. జయలలిత తమిళనాడుకు ముఖ్యమంత్రి అయినప్పటికీ తెలుగువారికి ఎంతో సుపరిచితురాలు. అమ్మ స్థానంలో ఆమెకు నమ్మినబంటుగా ఉన్న మంత్రి పన్నీర్ సెల్వం మరికాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన లాంఛనాలను పూర్తి చేయడానికి ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్ విద్యాసాగర్ రావును కలుసుకునేందుకు వెళతారు.
‘అమ్మ బాగానే ఉన్నారు.. ‘ఇక పురచ్చితలైవి ఇంటికి వచ్చేస్తారు..’ అన్న ఆనందం కొన్ని గంటల వ్యవధిలోనే ఆవిరైపోవడంతో అభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరయ్యారు. సరిగ్గా రెండున్నర నెలల క్రితం జయలలిత డీహైడ్రేషన్, తీవ్ర జ్వరంతో బాధపడుతూ సెప్టెంబరు 22న స్థానిక గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. జయకు అమర్చిన కృత్రిమ శ్వాస పరికరాన్ని కూడా తొలగించడంతో త్వరలోనే ఆమె క్షేమంగా ఇంటికి చేరుకుంటారని అన్నాడీఎంకే నేతలు భావించారు. కానీ ఇంతలోనే చేదు వార్త వినాల్సివచ్చింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







