వీసా బ్యాన్ మరో ఆరు నెలల పొడిగింపు
- December 05, 2016
మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్, ప్రైవేట్ సెక్టార్‌లోని కొన్ని ప్రొఫెషన్స్‌కి చెందిన కార్మికులకు కొత్తగా వీసాలు జారీ చేయకుండా మరో ఆరు నెలలపాటు బ్యాన్‌ని పొడిగించింది. మూడేళ్ళుగా ఈ బ్యాన్ కొనసాగుతోంది. ఇందులో కన్స్ట్రక్షన్ వర్కర్స్, క్లీనర్స్, సేల్స్ మరియు మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ తదితర విభాగాలున్నాయి. మినిస్ట్రీ నవంబర్ 30న నాలుగు డెసిషన్స్‌ని వీసా బ్యాన్‌ని పొడిగిస్తూ తీసుకున్నారు. కార్పెంటర్స్, మెటల్లర్జిస్ట్స్, బ్లాక్స్మిత్స్, బ్రిక్ క్లిన్ వర్కర్స్‌కి ఈ బ్యాన్ నుంచి మినహాయింపు ఉంటుంది. వీరికి డిసెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. మిగతావారికి జనవరి 1, 2017 నుంచి అమల్లోకి రానుంది. నవంబర్ 2013లో విధించిన ఈ బ్యాన్‌కి సంబంధించి సేల్స్, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్, క్యామెల్ కీపర్స్ కోసం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. కార్పెంటర్లు, మెటలర్జిస్ట్స్, బ్లాక్స్మిత్స్, బ్రిక్ క్లిన్ వర్కర్స్‌కి సంబంధించిన నిర్ణయం జనవరి 1, 2014 నుంచి అమల్లోకి వచ్చింది. ఎక్స్లెంట్, ఇంటర్నేషనల్ గ్రేడ్, కన్సల్టెన్సీస్, ప్రభుత్వ ప్రాజెక్టుల్ని నిర్వహిస్తున్న సంస్థలపై ఈ నిర్ణయం తాలూకు ఎఫెక్ట్ ఏమాత్రం ఉండదు. యజమాని ద్వారా ఫుల్‌టైమ్ నిర్వహించేవి, రియాదాతో రిజిస్టర్ అయినవి, పబ్లిక్ అథారిటీ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్‌తో ఇన్స్యూర్ అయినవీ దీన్నుంచి మినహాయింపు పొంది ఉన్నాయి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







