విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో వెనక్కి మళ్ళిన రాష్ట్రపతి

- December 06, 2016 , by Maagulf
విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో వెనక్కి మళ్ళిన రాష్ట్రపతి

జయలలితకు నివాళులు అర్పించేందుకు చెన్నై బయల్దేరిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో చెన్నై విమానాశ్రయంలో దిగకుండానే ఆ విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయింది. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ నుంచి బయల్దేరారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని తక్షణం వెనక్కి మళ్లించి ఢిల్లీకి తీసుకెళ్లిపోయారు. మరో విమానంలో రాష్ట్రపతి చెన్నైకి చేరుకుంటారని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com