యూఏఈలో సోషల్‌ మీడియా యూజర్స్‌కి 6 లీగల్‌ రిస్క్‌లు ఇవే

- December 07, 2016 , by Maagulf
యూఏఈలో సోషల్‌ మీడియా యూజర్స్‌కి 6 లీగల్‌ రిస్క్‌లు ఇవే

సోషల్‌ మీడియాలో ఏమైనా చేయవచ్చునని కొందరు అనుకుంటారు. లక్షలాది మందిని ఒకే వేదికపై కలవడానికి సోషల్‌ మీడియా ఎంతగానో ఉపయోగపడ్తుంది. తమ భావాల్ని ఇతరులతో పంచుకోడానికి ఇదో చక్కని వేదిక. అయితే ఇది చాలా సందర్భాల్లో దుర్వినియోగమవుతోంది. అనేక అనర్ధాలకూ ఇదే వేదికవుతోంది. ఈ కారణంగా యూఏఈ ప్రభుత్వం సోషల్‌ మీడియా వాడకానికి సంబంధించి కొన్ని నిబంధనల్ని తెరపైకి తెచ్చింది. వాటిని అతిక్రమిస్తే కొన్ని సమస్యలు తప్పవు. కాబట్టి ఈ క్రింది ఆరు ముఖ్యమైన విషయాల్ని యూఏఈలోని సోషల్‌ మీడియా యూజర్లు గుర్తుంచుకోవాలి. 
ఫొటోలను పోస్ట్‌ చేయడం: వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయరాదు. ప్రైవసీ మరియు కాన్ఫిడెన్షియాలిటీ: ఇతరు వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి, వారి పర్సనల్‌ ఫొటోల్ని వారి అనుమతి లేకుండా పోస్ట్‌ చేయడం నేరం. డిఫేమేటరీ స్టేట్‌మెంట్స్‌: ఇతరుల్ని డిఫేమ్‌ చేయడానికి సోషల్‌ మీడియాని వినియోగించరాదు. అభ్యంతరకరమైన తీరు: అన్‌ ఇస్లామిక్‌, నేరాల్ని ప్రోత్సహించేటటువంటి ఎలాంటి కామెంట్స్‌ పిక్చర్స్‌ సోషల్‌ మీడియాలో ఉంచరాదు. సామాజిక బాధ్యత ఇక్కడ అతి ముఖ్యం. ఇతరుల మనోభావాల్ని దెబ్బతీయకూడదు.ఆన్‌లైన్‌ మానిటరింగ్‌: యూఏఈ టిఆర్‌ఎ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ కంటెంట్‌ని మానిటరింగ్‌ చేస్తోంది. హేకింగ్‌, మాలిక్యులస్‌ కోడ్స్‌ వంటివాటిని పర్యవేక్షిస్తుంటుంది. లైసెన్స్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ కూడా అభ్యంతరకరమైన కంటెంట్‌ని బ్లాక్‌ చేసే అధికారం కలిగి ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com