డోనాల్డ్ ట్రంప్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక....
- December 08, 2016
త్వరలో అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కనున్న డోనాల్డ్ ట్రంప్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. టైం మ్యాగజైన్ ఈయనను ఈ ఏటి మేటి వ్యక్తిగా ఎంపిక చేసింది. పోటీలో నిలచిన 10 మంది ఫైనలిస్టులను దాటి ట్రంప్ టాప్ ప్లేస్ లో నిలిచారు. ఇక ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ రన్నరప్ గా నిలిచారు. ట్రంప్ గతంలో కూడా ఈ మ్యాగజైన్ నిర్వహించిన పోల్ లో పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు.
గత ఏడాది జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ ఈ హోదా దక్కించుకోగా, ట్రంప్ రన్నరప్ గా నిలిచాడు. అటు ప్రధాని మోదీ టైమ్ ఎంపిక చేసిన..11 మందితో కూడిన తుది లిస్టు లో ఘన విజయం సాధించారు. భారత ఓటర్లతో బాటు కాలిఫోర్నియా, న్యూజెర్సీ లలోని ఎన్నారైలు మోదీకే మా ఓటు అన్నారు.వార్తలను, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులకోసం ఈ మ్యాగజైన్ పోల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







