షార్జాలో పదిమంది కార్మికులపై దూసుకువెళ్లిన బస్సు ఒకరు మృతి

- December 09, 2016 , by Maagulf
షార్జాలో పదిమంది కార్మికులపై దూసుకువెళ్లిన బస్సు ఒకరు మృతి

జన్మభూమిని..కుటుంబసభ్యులను వదలి ఎడారి దేశాలలో కొలువు కోసం వచ్చిన వారు ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  షార్జాలో ఒక బస్సు ఉద్యోగుల సమూహం మీదకు దూసుకుపోయింది. ఒక వ్యక్తి మరణించగా,మరో తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన కార్మికులలో ఎనిమిది మంది భారతీయులు, ఇద్దరు పాకిస్థానీయులు ఉన్నారు. అల్ హంరియా ప్రాంతంలో ఒక రహదారి పక్కన వారు వేచి ఉన్న సమయంలో  ఒక బస్సు వారిపై నుంచి వేగంగా దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో క్షతగాత్రులందర్నీ ఖలీఫా ఆస్పత్రికి తరలించారు అయితే వీరిలో ఒక 34 ఏళ్ల కార్మికుడు మరణించాడు ప్రమాదం జరిగిన విషయం పోలీసులకు తెలియడంతోనే పెట్రోల్ బృందం ట్రాఫిక్ నిపుణులు మరియు అంబులెన్సులను ప్రమాద స్థలానికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి కారకుడైన  ఆసియా దేశానికి చెందిన డ్రైవర్ ను అదుపు లోనికి తీసుకున్నారు. మరణించిన కార్మికుని శరీరాన్ని మృతదేహాలను భద్రపరిచే గదికి తరలించబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com