వ్యవస్థాపకుడి మృతి: ఒమన్ ఫ్యాషన్ స్టోర్ మూసివేత
- December 09, 2016
మస్కట్‌లోని డిజైనర్ ఫ్యాషన్ స్టోర్‌ని మూసివేశారు. సంస్థ వ్యవస్థాపకుడు జునైద్ జమ్‌షెడ్ పాకిస్తాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మృతిచెందడమే దీనికి కారణం. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ప్రమాదంలో 47 మంది మృతి చెందారు. పాప్ స్టార్ టర్న్‌డ్ ఇస్లామిక్ ప్రీచర్ జునైద్ జమ్‌షెడ్, ఈ విమానంలో ప్రయాణించి మృత్యువాత పడ్డారు. ఆయనతోపాటు ఆయన భార్య కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా జునైద్ పలు ఫ్యాషన్ స్టోర్స్‌ని కలిగి ఉన్నారు. ఊఏఈ, సౌదీ అరేబియా, యుకె, యుఎస్‌ఎ, కెనడా, ఒమన్ తదితర దేశాల్లో షాప్‌లను నిర్వహిస్తున్న జునైద్, ఆస్ట్రేలియాలో కూడా ఓ స్టోర్‌ని ప్రారంభించవలసి ఉంది. రువి, మస్కట్‌లో ఉన్న జునైద్ ఫ్యాషన్ స్టోర్స్‌ని మూసివేశారు. తమ సంస్థల వ్యవస్థాపకుడి మృత పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, స్టోర్స్ ముందు బోర్డ్‌లు పెట్టడమే కాకుండా, ఫేస్ బుక్ పేజ్‌లో కూడా తమ యజమానికి నివాళులర్పించారు. 52 ఏళ్ళ జమ్‌షెడ్ పాకిస్తాన్‌లో ప్రముఖ సింగర్. ఆ తరువాత ఆయన ఇస్లామిక్ ప్రీచర్‌గా మారారు. ఫ్యాషన్ డిజైనర్‌గా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించడం జరిగింది. లాహోర్‌లో యూనివర్సిటీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి పట్టా పొందారాయన. 2004లో ఫ్యాషన్ క్లాతింగ్ రేంజ్‌ని ప్రారంభించారు. మస్కట్‌లో తొలిసారిగా 2016లో ఫ్యాషన్ బ్రాండ్ ఔట్‌లెట్‌ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!







