తెలుగు వ్యక్తి అమెరికాలోని హవాయిలో ప్రమాదంలో

- December 10, 2016 , by Maagulf
తెలుగు వ్యక్తి అమెరికాలోని హవాయిలో ప్రమాదంలో

అమెరికాలోని హవాయిలో ప్రమాదవశాత్తు ఈత కొలనులో పడిన సియాటెల్ కి చెందిన అత్యం సునీల్ గవాస్కర్ మృత్యువుతో పోరాడుతున్నాడు. హవాయిలో ఉంటున్న సునీల్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం కోమాలో వున్న సునీల్ కు బ్రైన్ సెల్స్ దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సునీల్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో.. సాయం అందించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ రంగంలోకి దిగింది. సునీల్ వైద్య ఖర్చులకు సాయం అందించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో నాట్స్ సభ్యులతోపాటు.. ప్రతి ఒక్కరిని సునీల్ కు సాయం చేయాలని నాట్స్ ప్రతినిధులు కోరుతున్నారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com