రోడ్డు ప్రమాదం: వ్యక్తికి మూడేళ్ళ జైలు, జరీమానా
- December 10, 2016
దోహా క్రిమినల్ కోర్ట్ ఓ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష అలాగే 18,000 ఖతారీ రియాల్స్ జరీమానా విధించింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, ఐదుగురు వ్యక్తుల మృతికి కారణమైన కేసులో న్యాయస్థానం ఈ తీర్పును ఇచ్చింది. మృతులు ఫిలిప్పీన్‌కి చెందినవారు. అలాగే 200,000 ఖతారీ రియాల్స్ మొత్తాన్ని ఒక్కో మృతుడి కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలియవస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో 18 ఏళ్ళ యువకుడు రిజిస్ట్రేషన్, రోడ్ పర్మిట్ గడువు తీరిన కారుని అతి వేగంగా నడుపుతూ ఎయిర్‌ఫోర్స్ స్ట్రీట్ నుంచి డిపాచ్యూర్స్ వైపు నడిపాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఆ కారు అదుపు తప్పి, పార్క్ చేసిన ఉన్న కారుని ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్, నిందితుడికి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాల్నీ సమర్పించింది.
తాజా వార్తలు
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు









