తగ్గిన పసిడి ధర

- December 10, 2016 , by Maagulf
తగ్గిన పసిడి ధర

బంగారం ధర మరింత పతనమైంది. ఇప్పటికే 10 నెలల కనిష్ఠానికి పడిపోయిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం నాటి ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.130 తగ్గి రూ.28,450 పలికింది. అంతర్జాతీయంగా డిమాండ్‌ తగ్గడం, ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం బంగారం తగ్గుదలకు కారణమైందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర రూ.600 తగ్గి రూ.41,250 పలికింది.
ఇక అంతర్జాతీయంగా బంగారం ధర 0.92 పడిపోయి ఔన్సు 1,159.60 డాలర్లుగా నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com