'ఫేస్బుక్' తో తస్మాత్ జాగ్రత్త
- September 04, 2015
ఫేస్ బుక్ తో డబ్బులు సంపాదించడం ఏలా??
కావలసినవి:
1) కంప్యూటర్/ల్యాప్ టాప్
2) ఇంటర్నెట్
3) ఫేస్ బుక్ అకౌంట్
4) ‘బకరా’ ఎన్నారైలు/బాగా డబ్బున్న ఇండియన్స్
5) ముదురుతనం
6) కులం కార్డు
***అదనపు బలం… మన పార్టీ అధికారంలో ఉండడం, ప్రళయాలు(తుఫానులు, భూకంపాలు) రావడం.
ఇంక విషయంలోకి వస్తే…
మొదటగా చెయ్యాల్సినది మనం పార్టీకి ఎంత వీర విధేయులమో కొన్ని పోస్టులు వేయాలి. తర్వాత మెల్లగా పార్టికి విధేయులుగా ఉన్న వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టాలి. అప్పుడప్పుడు అందరితో కలివిడిగా చాటింగ్ చెయ్యాలి.
ఆ తర్వాత, మనం ఒక సమాజ సేవకుడిగా బిల్డప్ ఇవ్వాలి. ఇద్దరు ముగ్గురు పిల్ల నాయకులతో ఫోటోలు దిగాలి.
మెల్లగా మన ఎన్నారైలను,”సర్ మన గవర్నమెంటు ఉంది ఇప్పుడు, మీకేదైనా ఇన్వెస్ట్మెంట్లు చేసే ఆలోచన ఉంటే చెప్పండి. నేను మొత్తం దగ్గరుండి చూసుకుంటా. అని అప్పుడప్పుడు ఆశ పెడుతుండాలి”.
అదే కాక, మనం A-Z పనులు చెయ్యగలమని కటింగులు ఇవ్వాలి. షేర్ మార్కెట్లు, వెబ్ డిజైనింగ్, గవర్నమెంటు ప్రాజెక్టులు అన్నీ మన చేతిలో ఉన్నట్టన్నమాట.
తుఫానులు, భూకంపాలొస్తే… మనం ఒక ఫండ్ రైజ్ చేయాలి. దానిలో ఎన్నారైలని భాగస్వామ్యులని చేయాలి.
వీటన్నిటికి తోడుగా మన ఎన్నారైల్లో చాలమందికి “ఎప్పటికైనా మన ఊరికెళ్ళి ఎమ్మెల్యేనో లేక మరేదైనా రాజకీయ పదవిలోనో సెటిల్ అయిపోదామనే ఆశ ఎక్కువ”. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి.
“అవతలి వాళ్ళ ఆశే మన పెట్టుబడి” అనే మాటని గట్టిగా నమ్మి, మనం ఎంత కలరింగ్ ఇస్తే అంత మంచిది. మెల్లగా డబ్బులు దండాలి. తిరిగి వాళ్ళు, డబ్బుల సంగతి అడిగితే మొహం తప్పించేయాలి.
ఇవే కాక,
**మనం మన వ్యాపారానికి కస్టమర్లని రప్పించుకుని, రెండు సార్లు మంచిగా సర్వీస్ చేసి మూడో సారి పెద్ద అమౌంటుకు టోపీ వెయ్యడం లాంటివి కూడా చూడొచ్చు.
** అమ్మాయిలా ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఎవడో ఒకడిని బాగా దువ్వి, “బయటకి వచ్చాను డార్లింగ్, పర్సు పోయింది. అర్జెంటుగా ఒక పదివేలు అకౌంట్లో వెయ్యి” అని చెప్పి దండొచ్చు.
** ఆరు నెలలు స్నేహం చేసి, కలసి మెలసి ఉండి… తర్వాత గుండె ఆపరేషన్ అని చెప్పి, డబ్బులు దండొచ్చు.
ఏతా వాతా తేలిందేంటంటే… ఎన్నారైల సేవా గుణం లేదా ఆశ మన ‘……..ష్ బ్రదర్స్’కి బాగా ప్లస్ అయ్యింది. ఇకనైనా జాగ్రత్త పడండి.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







