ప్యారడైజ్‌ బిర్యాని సెంటర్‌ మూసివేత..

- December 13, 2016 , by Maagulf
ప్యారడైజ్‌ బిర్యాని సెంటర్‌ మూసివేత..

సికింద్రాబాద్‌లో ప్యారడైజ్‌ బిర్యాని ఎంత ప్రాముఖ్యత కలిగినదో పేదలకు 'చె' రూపాయ్‌ బిర్యాని అంత ప్రఖ్యాతి . చంద్రలోక్‌ కాంప్లెక్స్‌లో కేవలం ఆరు రూపాయలకే వెజిటబుల్‌ బిర్యానితోపాటు మూడు పూరీలు కానీ, మూడు మైసూర్‌ బజ్జీలు కానీ, ఒక బ్రెడ్‌ బజ్జీ కానీ ఇచ్చేవారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ బిర్యానీ 6 రూపాయల నుండి 8, 10, 12, 16, 18 రూపాయలుగా పెరుగుతూ ప్రస్తుతం 23 రూపాయలకు చేరుకుంది. చంద్రలోక్‌ కాంప్లెక్స్‌ ప్రమాదం కారణంగా సోమవారం సాయంకాలం నుండి ఈ టిఫిన్‌ సెంటర్‌ మూసివేశారు. మంగళవారం ఈ చుట్టుపక్కల పనిచేసే చిరుద్యోగులు ఆకలితో ఇక్కడికి వచ్చి టిఫిన్‌ సెంటర్‌ మూసివేతను చూసి ఉసూరుమంటూ వెనుదిరిగారు.
ఇప్పుడు ఈ టిఫిన్‌ సెంటర్‌ భవిష్యత్తు జెఎన్‌టియు నిపుణుల నివేదికపై ఆధారపడి ఉంది.నిర్మాణాలపై ప్రత్యేక నజర్‌నిర్మాణంలో ఉన్న భవనాలు కూలుతోన్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎట్టకేలకు అప్రమత్తమైంది. పనులు జరుగుతోన్న నిర్మాణాలను పరిశీలించి అనుమతులు ఉన్నాయా..? లేదా..? అన్నది పరిశీలించడంతోపాటు..
ప్లాన్‌ ఎలా ఉంది..? స్ట్రక్చరల్‌ డిజైన్‌ సక్రమంగా ఉందా..? దాని ప్రకారం పనులు జరుగుతున్నాయా..? అన్నది పరిశీలించాలని భావిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com