వాషింగ్టన్లో మృత్యువుతో పోరాడుతూ మృతి చెందిన తెలుగు ఉద్యోగి
- December 14, 2016
భద్రాద్రి జిల్లా దమ్మపేటకు చెందిన అత్యం సునీల్ (36) అమెరికాలో కొలనులో పడి సోమవారం మృతి చెందాడు. టీఆర్ఎస్ నేత అత్యం శేఖరం కుమారుడు సునీల్ సాప్ట్వేర్ ఇంజనీర్‌గా వాషింగ్టన్లో ఉద్యోగం చేస్తున్నాడు. సునీల్ పనిచేసే కంపోనీ వారాంతంలో ఉద్యోగుల్లో ఒక జంటను లాటరీ పద్దతిలో ఎంపిక చేసి విహారయాత్రకు పంపుతుంది. ఇలా కుటుంబంతో శుక్రవారం హవాయి ఐల్యాండుకు వెళ్ళగా అక్కడ ఈతకొలను ఒడ్డున నడిచి వెళ్తూ కాలు జారి కొలనులో పడిపోయాడు అతడికి ఈత రాకపోవడంతో అక్కడ ఉన్నవారు వెంటనే కొలనులో దిగి సునీల్‌ను బయటకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే సునీల్ కోమాలోకి వెళ్ళిపోయాడు. బ్రైన్ సెల్స్ దెబ్బతిన్నాయని అతనికి చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. వారంరోజులుగా వైద్యం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









