జ్లీబ్ లో 286 మందిని అరెస్ట్ చేసిన భద్రతా సిబ్బంది
- December 16, 2016
జ్లీబ్ అల్ షుయూఖ్ ప్రాంతంలో ఆధునాతన భద్రతా ప్రచారంలో భాగంగా, 286 వ్యక్తులను వివిధ ఉల్లంఘనల కింద అరెస్టు చేశారు. ఈ ప్రచారంను ఆంతరంగిక మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ సులైమాన్ అల్ ఫాహ్డ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీ ప్రచారం నిర్వహించారు. భద్రతా పురుషులు సిబ్బంది అన్ని ప్రాంతాలు, వీధులు మరియు రహదారులు మూసి తనిఖీలు నిర్వహించగా క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్న ఇరువురు వ్యక్తులను అరెస్టు చేశారు. అలాగే సివిల్ కేసులకు సంబంధించి 20 మందిని అదుపులోనికి తీసుకొన్నారు. అదేవిధంగా వారి స్పాన్సర్లు నుంచి తప్పించుకొని పరారీలో ఉన్న 12 మంది దొరికినట్లు నివేదించబడింది.మరో 185 మందికి తమ పౌర గుర్తింపు కార్డు లేనందున , అదేవిధంగా 49 మందికి వారి వీసాల గడువు ముగియడంతో అరెస్ట్ చేశారు. అలాగే, అక్రమంగా అనుమతులు లేకుండా దేశంలోకి ప్రవేశించి మద్యం అమ్మకాలలో భాగస్వయులైన 9 మందిని అరెస్ట్ చేశారు. దీనితోపాటు 200 మందిని ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులలో అరెస్ట్ చేశారు. వీరిలో అక్రమ 35 వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకొన్నారు. 45 మంది తమ వాహన నెంబర్ ప్లేట్ల ను తొలగించిన నేరంకు అరెస్ట్ చేసి ఆ వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు. తనిఖీ సమయంలో వారి వారి పత్రాలు అధికారులకు చూపిన తర్వాత 3500 మందిని విడుదల చేశారు మోయి ఇటువంటి ఇంటెన్సివ్ ప్రచారాలు దేశంలో పలుమార్లు భద్రత నిర్వహించడానికి కొనసాగుతుందని ధ్రువీకరించాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







