3 రాష్ట్రాలలో ఎయిర్ అంబులెన్స్‌ సేవలు

- December 16, 2016 , by Maagulf
3 రాష్ట్రాలలో ఎయిర్ అంబులెన్స్‌ సేవలు

అత్యవసర సమయాల్లో రోగులకు వైద్య సేవలు అందించేందుకు, వారిని తరలించేందుకు 'ఏవియేటర్స్‌ ఎయిర్‌ రెస్క్యూ' సంస్థ చేపట్టిన గగనతల అంబులెన్స్‌ సేవలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం బెంగళూరులో ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌లతో దక్షిణాదిలోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అత్యవసర సమయంలో రోగులకు సేవలు అందిస్తామని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ శర్మ తెలిపారు. 'ఎయిర్‌బస్‌ హెలికాప్టర్‌ హెచ్‌-130'లను గగనతల అంబులెన్స్‌లుగా వినియోగిస్తామని, రోగులకు అత్యవసర చికిత్స అందించేలా వీటిని రూపుదిద్దామని పేర్కొన్నారు.
''ప్రతి హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్లు, ముగ్గురు వైద్య నిపుణులు ఉంటారు. స్ట్రెచర్‌, ప్రాణవాయువు, ఇతర వైద్య ఉపకరణాలు ఉంటాయి. ప్రస్తుతానికి మూడు హెలికాప్టర్లు దక్షిణాదిలో ఎంపిక చేసిన స్థావరాలను కేంద్రాలుగా చేసుకుని సేవలు అందిస్తాయి'' అని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com