విద్యార్థి నెంబర్‌ వన్‌!

- December 16, 2016 , by Maagulf
విద్యార్థి నెంబర్‌ వన్‌!

 కృ ష్ణచైతన్య కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'స్టూడెంట్‌ నెం.1'. రవికిరణ్‌ దర్శకుడు. కె.యల్‌.యన్‌.ప్రసాద్‌ నిర్మాత. హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు భానుచందర్‌ క్లాప్‌నిచ్చారు. దర్శకుడు దేవిప్రసాద్‌ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ''తన తప్పుని తెలుసుకొని మంచి మార్గంలో నడిచి నెంబర్‌ వన్‌ విద్యార్థి అనిపించుకున్న కుర్రాడి కథ ఇద''న్నారు. భానుచందర్‌ చెబుతూ ''కథానాయకుడిని సన్మార్గంలో నడిపే గురువు లాంటి పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నాన''న్నారు.
''నేను ఎన్టీఆర్‌ అభిమానిని. ఆయన సినిమా పేరు 'స్టూడెంట్‌ నెం.1' నా తొలి సినిమాకి టైటిల్‌ అవడం యాదృచ్ఛికమ''న్నారు కథానాయకుడు. ''ఈ నెల 20 నుంచి ఏకధాటిగా సాగే చిత్రీకరణతో సినిమాని పూర్తి చేస్తామ''న్నారు నిర్మాత.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com