సోషల్ మీడియా, మొబైల్ ఇంటర్నెట్ పై బ్యాన్!
- December 17, 2016
ఇంఫాల్‌లో చర్చిలపై దాడుల నేపథ్యంలో వదంతులు
మత ఉద్రిక్తతలు నివారించేందుకు అధికారుల నిర్ణయం
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజధాని ఇంఫాల్‌లోని మణిపూర్ బాప్టిస్టు కన్వేన్షన్ సెంటర్ చర్చి, తాంగ్ఖుల్ చర్చిపై అల్లరిమూకలు రాళ్లు రువ్వడంతో కలకలం రేగింది. చర్చిలపై దాడుల అంశంపై వదంతులు వస్తుండటంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వదంతుల వ్యాప్తిని, మత ఉద్రిక్తతలను నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్పై, సోషల్ మీడియా వెబ్సైట్లపై నిషేధం విధించారు.
మణిపూర్‌లోని పలు జిల్లాలు నాగాల పూర్వీకుల భూభాగాన్ని ఆక్రమిస్తున్నాయంటూ నాగా గిరిజన గ్రూపులు ఆందోళనకు దిగడంతో మణిపూర్‌లో హింసాత్మక వాతావరణం నెలకొంది.
మణిపూర్‌కు నిత్యావసరాలు సరఫరా అయ్యే ప్రధాన రహదారిని గిరిజనులు దిగ్బంధించడంతో ఆ రాష్ట్ర ప్రజలు నిత్యావసరాలతోపాటు కనీస ఔషధాలు లేక అల్లాడుతున్నారు. మరోవైపు నాగా ఉగ్రవాదుల దాడులతో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇంఫాల్‌లో నాగా వర్గం ప్రజలు
తరచూ సందర్శించే చర్చిలపై కొందరు అల్లరిమూకలు రాళ్లు విసరడం కలకలం రేపింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







