రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.!
- December 19, 2016
రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. అన్ని రైళ్లలో ఆర్ఏసీ కోటాను పెంచాలని నిర్ణయించింది. జనవరి 16 నుంచి అన్ని రైళ్లలో అదనపు ఆర్ఏసీ కోటాను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది. ఆర్ఏసీ విభాగంలో ప్రయాణించేవారి సంఖ్యను పెంచుతూ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో స్లీపర్ కోచ్‌లో ఐదు సైడ్‌లోయర్ బెర్తుల్లో పది మందికి, మూడో తరగతి ఏసీ కోచ్‌లో రెండు సైడ్ లోయర్ బెర్తుల్లో ఇద్దరిని, రెండో తరగతి ఏసీ కోచ్‌లో లోయర్ బెర్తులో మరో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతించేవారు. తాజాగా ఆ సంఖ్యను పెంచుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.
స్లీపర్ కోచ్, మూడో తరగతి ఏసీలో మరో రెండు లోయర్ బెర్తుల్లో ఆర్ఏసీ ప్రయాణికులు ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. రెండో తరగతి ఏసీలో మరో లోయర్ బెర్తును ఆర్ఏసీ విభాగంలోకి చేర్చింది. గతంలో స్లీపర్, రెండో తరగతి, మూడో తరగతి ఏసీల్లో ఆర్ఏసీ కింద 18 మంది ప్రయాణించే వీలువుండగా, ప్రస్తుత నిర్ణయంతో అదనంగా మరో 10మంది ఆర్ఏసీ ప్రయాణికులకు ప్రయోజనం దక్కనుంది.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







