'కాటమరాయుడు'తో భోజనం..

- December 20, 2016 , by Maagulf
'కాటమరాయుడు'తో భోజనం..

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా కిషోర్‌ కుమార్‌ పార్దసాని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'కాటమరాయుడు'. ఈ చిత్రం సెట్‌లో పవన్‌.. నటులు శివబాలాజీ, అజయ్‌, కమల్‌ కామరాజు, చైతన్యలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా తీసిన సెల్ఫీలను శివబాలాజీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. 'కాటమరాయుడు' లొకేషన్స్‌ నుంచి ప్రత్యక్ష ప్రసారమని, తాను ఎంత సంతోషంగా ఉన్నానో వివరించలేనని పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్‌ ప్రపంచంలోనే అద్భుతమైన వ్యక్తని పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలో పవన్‌ ముగ్గురు సోదరులుగా అజయ్‌, శివబాలాజీ, కమల్‌ కామరాజు నటిస్తున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com