అమరవీరులకు బహ్రెయిన్‌ శ్రద్ధాంజలి

- December 20, 2016 , by Maagulf
అమరవీరులకు బహ్రెయిన్‌ శ్రద్ధాంజలి

అమరవీరుల సేవల్ని బహ్రెయిన్‌ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా చెప్పారు. కమ్మెమరేసన్‌ డే సందర్భంగా కింగ్‌ హమాద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ప్రాణాలొదిల్ని ప్రతి ఒక్కరూ దేశ ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కింగ్‌ హమాద్‌ అన్నారు. అమరవీరుల కుటుంబాల్ని ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ఎంతో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని ఆయన తెలియజేశారు. నవతరానికి అమరవీరులు మార్గదర్శకులుగా నిలుస్తారనీ, దేశ సేవ కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదని నిరూపించిన అమరవీరులు దేశానికి ఆదర్శమని కింగ్‌ హమాద్‌ కొనియాడారు. వారి త్యాగాలకు వెలకట్టలేమని, వారిలా ప్రతి ఒక్కరూ దేశభక్తితో, బాధ్యతతో వ్యవహరించినప్పుడే అమరవీరులకు ఘన నివాళి పలికినట్లవుతుందని కింగ్‌ హమాద్‌ అన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com