తేలియాడుతున్న మంచు గ‌డ్డపై పియానో ప్రద‌ర్శన!

- December 21, 2016 , by Maagulf
తేలియాడుతున్న మంచు గ‌డ్డపై పియానో ప్రద‌ర్శన!

ఇటలీకి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు లుడోవికో ఇనోది, ఆర్కిటిక్ సముద్రంలో ఇచ్చిన ప్రదర్శన ప్రపంచ‌వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సంగీత ప్రియులు అత‌ని అద్భుత‌ బాణీల‌కు మంత్రముగ్ధులైతే.. ప‌ర్యావ‌ర‌ణవేత్తల‌ను ఈ ప్రద‌ర్శన ఆలోచ‌న‌లో ప‌డేసింది. ప్రద‌ర్శనలో అంత‌ర్లీనంగా మాన‌వాళికి ముంచుకొస్తున్న ముప్పు గురించి చెప్పాడు ఇనోది. ఆర్కిటిక్‌ మ‌హాస‌ముద్రంలో తేలియాడుతున్న మంచు గ‌డ్డపై పియానో వాయిస్తూ ఇచ్చిన ప్రదర్శనకు మంచి స్పందన వస్తోంది. ఆర్కిటిక్‌కు స్మృతిగీతం పేరుతో ఈ ప్రద‌ర్శన సాగింది. ఇనోది ప్రత్యేకంగా దీనికోస‌మే ఈ ట్యూన్‌ను కంపోజ్ చేశారు. ఈ ప‌ర్ఫార్మెన్స్‌ను గ్రీన్‌పీస్ సంస్థ స్పాన్సర్ చేసింది. ప్రపంచ నేత‌లూ ఆర్కిటిక్ వైపు ఓసారి చూడంటూ ఈ ప్రద‌ర్శన ద్వారా పిలుపునిచ్చారు. గ్లోబ‌ల్ వార్మింగ్ కార‌ణంగా ఊహించిన దానిక‌న్నా వేగంగా ఆర్కిటిక్ క‌రిగిపోతోందని, ఇప్పటికైనా మేల్కోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com