పాట చిత్రీకరణ సందడిలో '2.ఓ'

పాట చిత్రీకరణ సందడిలో '2.ఓ'

శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం '2.ఓ'. ఇది 'ఎందిరన్‌'కు సీక్వెల్‌ అనే విషయం తెలిసిందే. ఎమీజాక్సన్‌ కథానాయిక. అక్షయ్‌కుమార్‌ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన యుగళగీతాన్ని ఉత్తరప్రదేశ్‌లో చిత్రీకరించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

దీనికోసం ఇటీవల శంకర్‌ తన శిష్యులతో కలిసి లొకేషన్లు చూసొచ్చారని తెలిసింది. జ్ఞానేశ్వర్‌ మిశ్రా పార్కు, గోమతి నది తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నారు. ఈ విషయాన్ని యూపీ చలన చిత్రాభివృద్ధి మండలి ఉపాధ్యక్షుడు గౌరవ్‌ ద్వివేది కూడా స్పష్టం చేశారు. దక్షిణాది చిత్ర పరిశ్రమను ఆకర్షించేరీతిలో ముఖ్యమంత్రి సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, శంకర్‌ వంటి దర్శకుడు తమ రాష్ట్రంలో చిత్రీకరణ జరపనుండటం ఆనందంగా ఉందని తెలిపారు. తమపరంగా అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Back to Top