220 మంది భారత మత్స్యకారులను విడిచిపెట్టిన పాకిస్తాన్
- December 25, 2016
పాక్ జైళ్లలో ఉన్న 220 మంది భారత మత్స్యకారులను ఆ దేశం ఆదివారంనాడు విడిచిపెట్టింది. పరస్పర సౌహార్ద్ర చర్యల్లో భాగంగా వీరిని ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల కాలంలో సరిహద్దుల్లో ఉగ్ర ఘటనలు, చొరబాట్లతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో భారత మత్స్యకారుల విడుదల ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో ప్రవేశించారన్న ఆరోపణలతో అరెస్టు చేసిన 220 మంది మత్స్యకారులను కరాచీలోని మలిర్ జైలు నుంచి విడుదల చేసి లాహోర్‌కు రైలులో తీసుకువెళ్లారు. అక్కడ వాగా సరిహద్దుల్లో భారత అధికారులకు వారిని అప్పగించినట్టు మలిర్ జైలు సూపరింటెండెంట్ హసన్ సెహ్టో తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..







