ఖతార్లో జాబ్ ఛేంజ్: ఎగ్జాట్ వీసా తప్పనిసరి..
- December 25, 2016
ఖతార్లో ఉద్యోగాలు మార్చుకోవాలనుకునేవారు, ఖచ్చితమైన వీసా కలిగి ఉండాలి. ఓ కార్మికుడు వేరే ఉద్యోగంలోకి వెళ్ళాలంటే, కొత్త ఉద్యోగంలో ఒకే దేశానికి చెందిన వ్యక్తి ద్వారా ఆ కొత్త ఉద్యోగం ఖాళీ అవ్వాల్సి ఉంటుంది. డిసెంబర్ 13 నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం ఎంట్రీ, ఎగ్జిట్ మరియు రెసిడెన్సీ విధానాల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ ఈ అంశాలపై స్పష్టతనిచ్చింది. ఉదాహరణకు ఫిలిప్పీన్కి చెందిన మేల్ వర్కర్, తాను చేస్తున్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటే అక్కడ కూడా అదే జాతీయుడి ద్వారా ఖాళీ అయిన పోస్ట్ ఉండి ఉండాలి. ఫిక్స్డ్ టెర్మ్ కాంట్రాక్ట్స్ మీదున్నవారు, కొత్త సంస్థలో చేరాలనుకుంటే, 30 రోజుల ముందు నోటీసు ఇవ్వవలసి ఉంటుంది. ఓపెన్ ఎండెడ్ కాంట్రాక్ట్ మీద ఉంటే, ఐదేళ్ళపాటు ఉద్యోగం కొనసాగిస్తేనే అర్హులవుతారు. ఇంకో వైపున 60 ఏళ్ళ వయసు పైబడినవారికి ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్టుల పునరుద్ధరణ చేయరాదనే ఆలోచనల్ని చేస్తోంది మినిస్ట్రీ. ఇదిలా ఉండగా ఉద్యోగ మార్పుకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా, మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్కి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్ టీమ్ ద్వారా పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. సంబంధిత ఫోన్ నెంబర్ లేదా ఇ-మెయిల్ అడ్రస్ ద్వారా సహాయం పొందడానికి వీలుంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







