కొత్త సంవత్సర శుభాకాంక్షలతో కాటమరాయుడు పోస్టర్..

- December 26, 2016 , by Maagulf
కొత్త సంవత్సర శుభాకాంక్షలతో కాటమరాయుడు పోస్టర్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం కాటమరాయుడు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఉగాది కానుకగా విడుదల కానుంది. సర్దార్ గబ్బర్ సింగ్ పరాజయం తరువాత పవన్ కళ్యాణ్ చేస్తున్న కాటమరాయుడు చిత్రంపై అభిమానులలో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం పొలాచ్చిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది మొదటి వారంలో ఈ చిత్రానికి సంబంధించి రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అయితే ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ కానుకగా ఓ గిఫ్ట్ ఇవ్వాలని టీం భావించింది. అందుకోసం కొత్త సంవత్సర శుభాకాంక్షలతో కాటమరాయుడు పోస్టర్ ను విడుదలచేస్తారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర నిర్మాత శరత్ మరార్ త్వరలో విడుదల చేస్తామని ప్రకటించాడు.

తమిళ చిత్రం 'వీరమ్'కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయికగా శృతి హాసన్ నటిస్తోండగా, ఐదుగురు అన్నదమ్ముల నేపథ్యంలో ఈ చిత్రం నడవనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ కి తమ్ముళ్లుగా అజయ్, శివ బాలాజీ మరియు కమల్ కామరాజు నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com