బంగారం ధర అంచనాలకు చిక్కడం లేదు..
- December 27, 2016
డిసెంబరు 27: పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారం ధర చంచలంగా మారింది. పెద్ద నోట్లు రద్దు కాగానే నల్ల కుబేరులు క్వింటాళ్ల కొద్దీ బంగారం కొన్నారు. తమ నల్లధనాన్ని దాచుకోవడానికి అదే సురక్షిత మార్గంగా భావించారు. ఫలితంగా దేశీయంగా బంగారం ధర అమాంతం పెరిగింది. నల్లబజారులో తులం(పది గ్రాముల) ధర రూ.50 వేల వరకు వెళ్లింది. కానీ... నగదు అందుబాటులో లేకపోవడం, బంగారు కొనుగోళ్లపై నజర్, ఆంక్షల నేపథ్యంలో ఒక్కసారిగా కొనుగోళ్లు పడిపోయాయి. దాంతో ఒక్కసారిగా బంగారం క్రేజ్ తుస్సుమంది.
కొనేవారు లేకుండా పోయారు. 24 కేరట్ల బంగారం తులం ధర ఏకంగా 28 వేలకంటే దిగువకు పడిపోయింది. మరోపక్క అమెరికా ప్రభుత్వం వడ్డీరేట్లు పెంచింది. అంతర్జాతీయంగా బంగారం కన్నా అమెరికా సర్కారీ బాండ్లే లాభదాయకంగా మారడంతో బంగారం ధర మరింత పడింది.
సోమవారమే బంగారం ధర ఏకంగా రూ.250 మేరకు పడిపోయి...11నెలల కనిష్ఠానికి చేరింది. ఇక బంగారం పని అయిపోయిందని విశ్లేషణలు వచ్చాయి. అయితే... మంగళవారం ఢిల్లీ ధర ఒకేరోజు అమాంతం 450 రూపాయలు పెరిగింది. దీంతో... బంగారం ధర అంచనాలకు చిక్కడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







