30న 'నేనొస్తా'
- December 29, 2016
జ్ఞానప్రకాష్, సూర్య శ్రీనివాస్, ప్రియాంక పల్లవి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'నేనొస్తా'. పరంధ్ కళ్యాణ్ దర్శకుడు. బాషా మజహర్ నిర్మాత. 'సమాజంలో నాలాంటి రాక్షసులను తయారు చేయొద్దు' అనేది ఉపశీర్షిక. ఈ శుక్రవారం విడుదల కానుంది. గురువారం హైదరాబాద్లో ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఏర్పాటైన విలేకర్ల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ''ప్రేమతో సాగే రొమాంటిక్ థ్రిల్లర్. ప్రేక్షకులు కోరేవన్నీ ఉంటాయి. ఈ నెల 30న విడుదల చేస్తున్నామ''న్నారు. దర్శకుడు చెబుతూ ''ఓ ప్రేమజంట జీవితాల్లోకి మరో వ్యక్తి ప్రవేశిస్తే ఎలాంటి పరిణామాలు సంభవించాయనేదే ఈ కథ. ఆద్యంతం ఉత్కంఠ కలిగే దృశ్యాలు, మూడు పాటలతో తెరకెక్కించామ''న్నారు. ఛాయాగ్రహణం: సాంబశివ రెడ్డి, సంగీతం: అనురాగ్ వినీల్
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







