ప్రపంచానికి యూఏఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు

- December 30, 2016 , by Maagulf
ప్రపంచానికి యూఏఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు

యూఏఈ ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రముఖులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు పంపించారు. కొత్త ఏడాది ప్రపంచమంతా శాంతియుతంగా వుండాలని ఆకాంక్షించిన షేక్‌ ఖలీఫా, ఆయా ప్రముఖులంతా ఆయురారోగ్యాలతో ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరంలో ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌ మరియు ప్రైమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌, డిప్యూటీ సుప్రీమ్‌ కమాండర్‌ - యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ తదితరులు కూడా ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పలువురు నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com