ఈ ఏడాది సీనియర్ హీరోలు జోరు..

- December 30, 2016 , by Maagulf
ఈ ఏడాది సీనియర్ హీరోలు  జోరు..

ఈ ఏడాది చాలా స్పీడ్ గా గడిచినట్టు కనిపించింది. కాలం వేగంగా గడవడమే కాదు.. మన టాలీవుడ్ హీరోలు కూడా స్పీడ్ పెంచారు. యంగ్ హీరోలు చకచకా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అది చూసి సీనియర్ హీరోలు కూడా మేమేం తక్కువా అన్నట్టు వాళ్లతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు. కిందటి ఏడాదివరకూ కనిపించని ఈ స్పీడ్ హఠాత్తుగా 2016తో స్టార్ట్ అయింది. సీనియర్స్ పరంగా ఈ సంవత్సరం ఒక ముఖ్యమైన విశేషమే జరిగింది.

సినిమా హీరోలకు సంబంధించి సినిమా పరిశ్రమలో ఎన్నడూ జరగని ఒక అరుదైన ఈవెంట్ 2016లో జరిగింది. సాధారణంగా ఏదైనా సినిమా వేడుక జరిగినప్పుడు కొందరు హీరోలు ఆ ఫంక్షన్ కి రావడం, ఒకరితో ఒకరు ముచ్చట్లాడుతూ గడపడం కనిపిస్తూంటుంది.

ఫ్యాన్స్ కు అది హ్యాపీ అకేషన్. మరి అలాంటిది నలుగురు సీనియర్ హీరోల సినిమాలు ఒకే ఏడాది ప్రారంభమైతే?..ఇంక చెప్పేదేముంది. .. ..ఫుల్ హ్యాపీస్. 

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మెగాస్టార్ చిరంజీవికి వరల్డ్ వైడ్ గా అభిమానులున్నారు. చిరంజీవి సినిమాలు చేయడం మానేసి దాదాపు తొమ్మిదేళ్ల కావడంతో ఆయన సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఇంతకాలం అదేపనిగా వెయిట్ చేస్తున్నారు. ఆ శుభసమయం 2016లో వచ్చింది. ఇదొక మంచి అకేషన్ . అయితే దీని కంటిన్యూయేషన్ కూడా ఉంది. సీనియర్ హీరో బాలకృష్ణ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కూడా ఈ ఏడాదే ప్రారంభమైంది.

మెగాస్టార్ చిరంజీవి సినిమా యాక్షన్ పిక్చర్ అయితే ..బాలకృష్ణ సినిమా హిస్టారికల్. వీరిద్దరి సినిమాలూ ఇలా ఒకే ఏడాది ప్రారంభం కావడం చాలా కాలం తర్వాత జరిగింది. 18 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఈవెంట్ ప్లేస్ చేసుకుంది. ఇంక విక్టరీ వెంకటేష్ నటిస్తున్న గురు సినిమా కూడా ఈ ఏడాదే స్టార్టయింది. బాబు బంగారం తర్వాత ఆయన ఈ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే నాగార్జున సినిమా ఓం నమో వేంకటేశాయ చిత్రం కూడా ఇదే సంవత్సరం ప్రారంభమైంది. అయితే ఈ నలుగురు హీరోల సినిమాలు వచ్చే ఏడాదే విడుదల కానుండడం విశేషం.

గతంలో ఏ ఒకరిద్దరి హీరోల సినిమాలు ఒకే ఏడాది ప్రారంభం అయ్యాయి కానీ నలుగురు సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు ఇలా ఒకే ఏడాది ప్రారంభం కావడం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. అలాంటి అరుదైన అదృష్టాన్ని 2016 దక్కించుకుంది. ఈ అదృష్టానికి హీరోల ఫ్యాన్స్ పులకించిపోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com