ఎటిఎం మోసం కేసులో 6 గురుని అరెస్ట్ చేసిన సౌదీ పోలీసులు
- December 31, 2016
జెడ్డా: ఎటిఎం మోసం కేసులో ఆరుగురిని విచారణ భాగంగా అరెస్టు చేసినట్లు మక్కా పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసులకు ఎటిఎంలలో బ్యాంకు నిధుల దుర్వినియోగం కాబడుతున్నట్లు అనేక పిర్యాదులు అందినట్లు పోలీసు ప్రతినిధి కల్నల్ ఎటి అల్ క్కురాశి శుక్రవారం చెప్పారు. బ్యాంకులను మోసం చేస్తున్న వారిపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో పోలీసులు నిఘా అధికం చేశారు.జెడ్డాలో ఎటిఎం యంత్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలను రహస్యంగా అమర్చి వినియోగదారుల కార్డు పిన్ తదితర వివరాలు తెలుసుకొని మోసానికి దొంగిలించడానికి బ్యాంకుల వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న కొందరు నిందితులను దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రాలలో ఎటిఎంల వద్ద ఈ తరహా నేరాలు పెరిగినట్లు నివేదికలు అందుకున్నపోలీసులు తరువాత, అటువంటి మోసపూరిత కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఒక భద్రతా ప్రణాళికను ఏర్పాటుచేసినట్లు పోలీసు విభాగం ప్రతినిధి వివరించారు.సిరియన్ జాతీయతకు చెందిన ఆరుగురు నిందితులను అదుపులో తీసుకొన్నారు. వారిని క్షుణంగా శోధించిన తరువాత పోలీసులు వారి వద్ద మీటర్ రీడర్లు మరియు ఇతర పరికరాలు కనుగొన్నారు. వ్యాపార వీసాలతో కింగ్డమ్ లోనికి ప్రవేశించిన 6 అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







