బిఎస్ఎన్ ఎల్ రూ.144కే అపరిమిత కాల్స్..
- December 31, 2016
కొత్త సంవత్సరం సందర్భంగా భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ ఎల్) బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కలిగిన వినియోగదారుల కోసం ప్రమోషనల్ ఆఫర్‌ను తెచ్చింది. ఇందులో భాగంగా 144 రూపాయల ప్రీపెయిడ్ ఓచర్‌తో 30 రోజులపాటు అపరిమితంగా లోకల్/ఎస్ టిడి కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ ప్లాన్ కాలపరిమితి 180 రోజులు. ఉచిత కాల్స్ తర్వాత లోకల్/ఎస్ టిడి కాల్స్‌పై నిమిషానికి 80 పైసలు, ఎస్ఎంఎస్ కు 50 పైసలు, రోమింగ్‌లో లోకల్ ఎస్ఎంఎస్ కు 38 పైసలు వసూలు చేస్తారు. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కలిగిన వినియోగదారులు ఇతర ఆపరేటర్ల సిమ్ కార్డు కలిగి ఉంటే..
ఎంఎన్‌పి ద్వారా బిఎస్ఎన్ ఎల్‌కు మారి కూడా ఈ ఆఫర్‌ను పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఓచర్‌ను బిఎస్ఎన్ ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ ద్వారా మాత్రమే పొందవచ్చని పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







