బుల్లి దేశముదురు వస్తున్నాడోచ్!!
- September 09, 2015
మెగా ఫ్యామిలీ నుంచి మరో స్టార్ హీరో సన్.. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడని ఫిలింనగర్ లో టాక్ వినపడుతోంది. ఇప్పటికే పండగలకు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఆ స్టార్ కిడ్.. త్వరలోనే వెండితెరపై మురిపిస్తాడని తెలుస్తోంది. ఇంతకీ ఎవరా మెగా ఫ్యామిలీ వారసుడు..? వారసుల ఎంట్రీకి టాలీవుడ్ మంచి ఫ్లాట్ ఫామ్ గా మారింది. పలువురు అగ్ర హీరోల కొడుకులతో ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమ నిండిపోయింది. ఇప్పుడు ఆ ఫ్యామిలీస్ నుంచి థర్డ్ జనరేషన్.. అంటే యంగ్ హీరోల పిల్లలు కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. గత ఏడాది మహేశ్ బాబు తనయుడు గౌతమ్ చైల్డ్ ఆర్టిస్టుగా మురిపించగా.. తాజాగా హీరో సుధీర్ బాబు కొడుకు చరిత్ కూడా భలే భలే మగాడివోయ్ సినిమాతో బాలనటుడిగా ఆకట్టుకున్నాడు. మున్ముందు ఈ జాబితా మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వీరందరిలో ముందుగా సన్నాఫ్ స్టైలిష్ స్టార్ ఎంట్రీ ఉంటుందని లేటెస్ట్ న్యూస్. అర్జున్ ముద్దుల కొడుకు అయాన్ క్యూట్ పిక్స్.. ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రతి పండక్కి నయా లుక్ లో కనిపించి అదరగొట్టేస్తున్నాడు ఈ చోటా స్టైలిష్ స్టార్. గత ఏడాది క్రిస్ మస్ కి శాంతాక్లాజ్ తాత గెటప్ లో చిరునవ్వులు చిందించిన అయాన్.. ఆ తర్వాత హోలి, చాచా నెహ్రూ బర్త్ డేకి ఆయా గెటప్స్ లో సందడి చేశాడు. తాజాగా కృష్ణాష్టమి రోజున చిన్ని కన్నయ్య వేషంలోనూ హంగామా చేశాడు. చూస్తుంటే.. అయాన్ కూడా త్వరలో బాలనటుడిగా మెరవడం ఖాయమని చెప్పొచ్చు. షారుక్ ఖాన్ హ్యాపీ న్యూ ఇయర్ మూవీలో చోటా బాద్షా అబ్రమ్ ఖాన్ ఎంట్రీ ఇచ్చినట్లు... అల్లు అర్జున్ మూవీస్ లో బుల్లి స్టైలిష్ స్టార్ అయాన్ అరంగేట్రం కూడా ఉంటుందేమో చూడాలి.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







