మన కవి "కాళోజి "
- September 09, 2015
"కాళోజి " కేవలం ఒక కవి మాత్రమే కాదు, ఒక అక్షరతో లక్ష మెదళ్ళను కదిలించవచ్చు అని నమ్మినవాడు . ఒక ఉద్యమకర్త , ఒక సామాజికవేత్త. గిడుగు రామ్మూర్తి ప్రజలకు అర్ధం అయ్యే భాషలోనే గ్రంధ రచన సాగాలి అని కోరుకుంటే , ప్రజలు మాట్లాడుకొనే భాషలో రచన సాగాలి అని నమ్మినవాడు, రాసినవాడు. ప్రతి భాషకు మాండలీకాలు సహజం , తన దైన మాండలీకాన్ని ప్రజలందరికీ అర్ధం అయ్యేలా రచించి, ఆ మాండలీకాల సొగసును అందరికి అందించినవాడు. అయన రాసింది, ప్రభువుల కోసం కాదు, ప్రజల కోసం, అయన "నా గొడవ" అన్నది ప్రతివాడి గొడవ . అయన పేరు మీద ఉత్సవాలు జరిపించటమే కాదు, అయన ఆశయాలు, ఆయన ఆవేదనలు కు పరిష్కారాలే ఆయనకు నివాళి. " రాణివాసమున రంజిల్లు రాజా , రైతు బాధలు తీర్చి రక్షింపలేవా , పట్టణపు సొగసుకై పాటుపడు రాజా , పల్లెకందము గూర్చు ప్రతిభయే లేదా " అన్నది అప్పటి నైజాం కే కాదు, ఇప్పటి పాలకులకు కూడా హెచ్చరికే . కాళోజి సంస్మరణ అంటే ప్రతి తెలుగువాడి గుండెల్లో ఉన్న ఆవేదన స్మరించుకోవటమే . ఆయన కు ప్రాంతీయబేధాలు అంటగట్టటం అంటే కురచ మనస్తత్వాలను బయట పెట్టుకోవటమే. రాష్ట్రాలు రెండు కావచ్చు, నాలుగు కావచ్చు, వంద కావచ్చు కానీ మన అందరిది తెలుగు భాష , "దేశభాషలందు తెలుగు లెస్స " అన్నది అప్పుడే కాదు ఎప్పుడూ నిజమే. తెలుగు వాడినైనందుకు గర్వ పడతా, నా తెలుగు రెండు రాష్ట్రాల భాష అయినందుకు ఇంకా గర్వ పడతా . కాళోజి, గిడుగు ఇద్దరు స్మరణీయులే . తెలుగువారందరికి కావాల్సిన వారే.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







