ఇస్తాంబుల్‌లో తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్‌..

- January 01, 2017 , by Maagulf
ఇస్తాంబుల్‌లో తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్‌..

బహ్రెయిన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌, టర్కీలోని ఇస్తాంబుల్‌లో తీవ్రవాదులు జరిపిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, చాలామంది తీవ్రగాయాల పాలయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపిన బహ్రెయిన్‌, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రపంచమంతా తీవ్రవాదాన్ని ఖండించాలనీ, తీవ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని బహ్రెయిన్‌ ఈ సందర్బంగా అభిప్రాయపడింది. బహ్రెయిన్‌, టర్కీకి ఆపద సమయంలో అండగా ఉంటుందని సంతాప సందేశంలో బహ్రెయిన్‌ పేర్కొంది. బహ్రెయిన్‌ ప్రజలందరి తరఫున మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రస్తావించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com