అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో కొందరిని కలవనుకుంటున్న జుకర్‌బర్గ్
- January 04, 2017
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ సృష్టికర్త మార్క్ జుకర్‌బర్గ్ సరికొత్త సవాల్ విసిరారు. ఎవరికో కాదండోయ్.. తనకు తానే! ఏటా ఒక కొత్త సవాల్ (లక్ష్యం)ను పెట్టుకొని పూర్తిచేయడం ఆయనకు అలవాటు. 2017 పూర్తయ్యేలోగా అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో కొందరు వ్యక్తుల్ని వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకొన్నారు. గతంలో ఆయన స్వగృహానికి కృతిమ మేథస్సు ఏర్పాటు చేసుకోవడం, మాండరిన్ భాష నేర్చుకోవడం, 25 పుస్తకాలు చదవడం, 587 కిలోమీటర్లు పరుగెత్తడం వంటివి పెట్టుకొన్నారు. 'ఈ ఏడాది బయటకు వెళ్లి సాధ్యమైనంత ఎక్కువ మందిని కలవాలని నియమం పెట్టుకొన్నా. ప్రజలు ఎలా జీవిస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు, భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకుంటాను. ప్రపంచాన్నంతా అనుసంధానం చేసి ప్రతి ఒక్కరి గొంతుకకు ప్రాధాన్యం ఇవ్వడం నా పని. ఈ ఏడాది వారి అభిప్రాయాల్ని వ్యక్తిగతంగా వింటాను. ఫేస్‌బుక్, చాన్ జుకర్‌బర్గ్ సంస్థలను సమర్థంగా నడిపించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచం సరికొత్త యుగంలోకి అడుగిడుతున్న తరుణంలో ఇది సానుకూల ప్రభావం చూపుతుందని' జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







