దావూద్‌ ఆస్తులు సీజ్‌ రూ.15,000 కోట్లు విలువైన ఆస్తులను యూఏఈ ప్రభుత్వం సీజ్‌.....

- January 04, 2017 , by Maagulf
దావూద్‌ ఆస్తులు సీజ్‌ రూ.15,000 కోట్లు విలువైన ఆస్తులను యూఏఈ ప్రభుత్వం సీజ్‌.....

న్యూదిల్లీ: మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు చెందిన రూ.15,000 కోట్లు విలువైన ఆస్తులను యూఏఈ ప్రభుత్వం సీజ్‌ చేసింది. దీనిని నరేంద్రమోదీ దౌత్య విజయంగా పేర్కొంటూ భాజపా ట్వీట్‌ చేసింది. భారత్‌ పక్కాగా సమర్పించిన పత్రాల ఆధారంగానే యూఏఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు దీనిలో పేర్కొన్నారు. దావూద్‌ ఇబ్రహీం ఆస్తుల జాబితాను ప్రధాని అప్పజెప్పడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆ పార్టీ తెలిపింది.

దావూద్‌ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు. ఈ విషయాన్ని భారతీయ నిఘా సంస్థలు పసిగట్టాయి. ముంబయి బాంబు పేలుళ్లకు దావూద్‌ ప్రధాన సూత్రధారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com