భారీ స్థాయిలో ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాట్లు...

- January 06, 2017 , by Maagulf
భారీ స్థాయిలో ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాట్లు...

మెగా స్టార్ చిరంజీవి 150 సినిమా ఖైదీ నెంబర్ 150 వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి విధితమే... ఇప్పటికే సెన్సార్ కంఫ్లీట్ చేసుకొన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జనవరి 7 న జరుపుకోనున్నదనే సంగతి విధితమే.. చిరు ఫస్ట్ లుక్, టీజర్ సాంగ్స్ అందరినీ అలరించడమే కాదు.. మెగా అభిమానుల్లో, చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలను నెలకొల్పేలా చేశాయి.. కాగా ఖైదీ నెంబర్ 150 రైతు నేపద్యంలో తెరకెక్కుతున్నది. అనే సంగతి తెలిసిందే... ఈ సినిమాలో అన్నీ సాంగ్స్ ఒక ఎత్తుఐతే... రైతు బాధలను కళ్ళకు కట్టినట్లు చూపించిన "నీరు నీరు" సాంగ్ మరో ఎత్తుగా నిలిచింది.. ఈ సాంగ్ ఇప్పటికే అందరి ప్రశంసలను అందుకొన్నది.. కాగా తొలిసారిగా మెగా తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా మరి సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ లో నిర్మిస్తుండగా...... మరో ప్రతిష్ట్మాక సంష్ట లైకా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నది.. కాగా ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను భారీ స్థాయిలో నిర్వహిచేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలను చేస్తున్నది.. ఈ ఫంక్షన్ లో మెగా ఫ్యామిలీ నుంచి అందరూ హాజరు కానున్నారు.. రామ్ చరణ్, అల్లు అరవింద్, శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నీహారిక ఇలా అందరూ ఈ మెగా వేడుకకు హాజరు కానున్నారు.. కాగా ప్రత్యేక ఆహ్వానితులుగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, దర్శక రత్న దాసరి నారాయణ రావు హాజరు కానున్నారు.. అల్లు అరవింద్, జెమిని కిరణ్ ఆద్వర్యంలో ఈ వేడుకకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com