భారత్ టార్గెట్ గా చైనా మరో దుస్సాహసం
- January 06, 2017
భారత్ టార్గెట్ గా చైనా మరో దుస్సాహసం చేసింది. భారత్ కు సమీపంలో పాకిస్తాన్ లో సబ్ మెరైన్ నిర్మించింది. హిందూ మహాసముద్ర జలాల్లో చైనా న్యూక్లియర్ సబ్మెరైన్లు ఉన్నాయనడానికి గట్టి ఆధారం లభించింది. గతేడాది మేలో పాకిస్థాన్‌లోని కరాచీ హార్బర్లో చైనాకు చెందిన న్యూక్లియర్ అటాక్ సబ్‌మెరైన్ ఉన్నట్లు గూగుల్ ఎర్త్ ఇమేజ్ స్పష్టంచేసింది. ఈ సబ్‌మెరైన్‌కు చెందిన ఫొటోను మొదటగా శాటిలైట్ ఇమేజరీ ఎక్స్పెర్ట్ గుర్తించింది. చైనాకు చెందిన తొలి న్యూక్లియర్ పవర్ సబ్‌మెరైన్ చైనీస్ నేవీ టైప్ 091 హాన్ క్లాస్‌కు చెందిన సబ్మెరైన్గా తేలింది.
సాంప్రదాయ సబ్మెరైన్లకు ఈ న్యూక్లియర్ సబ్‌మెరైన్ పూర్తి విరుద్ధం. ఇవి చాలా తక్కువ ఇంధనంతో పనిచేయడం వల్ల ఎక్కువ కాలం నీటిలోపల ఆపరేషన్స్ నిర్వహించగలుగుతుంది. పైగా వీటి వేగం కూడా చాలా ఎక్కువ. గతంలోని చైనీస్ టైప్ 093 షాంగ్ క్లాస్ సబ్‌మెరైన్ కంటే ఎంతో ఎక్కువ సామర్థ్యం కలదని భారత నేవీ అధికారులు కూడా చెబుతున్నారు. హిందూ మహాసముద్ర జలాల్లో తమ సబ్మెరైన్లను మోహరించడం ద్వారా ఈ ప్రాంతంలో భారత్ ఆధిపత్యాన్ని చైనా ప్రశ్నిస్తోంది.
గత కొన్నేళ్లుగా హిందూ మహాసముద్ర జలాల్లో చైనీస్ సబ్మెరైన్లు ఉన్నట్లు ఇండియన్ నేవీ బలంగా విశ్వసిస్తోంది. హిందూ మహాసముద్ర జలాల్లోకి చైనీస్ సబ్మెరైన్లు రావాలంటే అది మలక్కా, లాంబోక్, సుందా జలసంధుల గుండానే సాధ్యమవుతుంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఈ ప్రాంతంలో సబ్మెరైన్లు ఉపరితలంపైనే ప్రయాణించాల్సి ఉంటుంది. దీనిద్వారా భారత్‌లాంటి దేశాలకు చైనీస్ సబ్మెరైన్లను గుర్తించడం సులువవుతోంది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్‌లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









