మయన్మార్‌లో రోహింగ్యా ముస్లిం వర్గంపై దాడులు
- January 06, 2017
అమ్మ ఒడిలో ఉండాల్సిన పదహారు నెలల చిన్నారి బురదలో ఇలా విగతజీవుడిగా పడి ఉండడాన్ని చూస్తే హృదయం కలచి వేస్తుంది. చిన్నారి పేరు మహ్మద్ షొహాయత్. మయన్మార్‌లోని రఖైన్ ప్రాంతంలో నివసిస్తున్న రోహింగ్యా వర్గానికి చెందిన జాఫర్ ఆలం కుమారుడు. రోహింగ్యా ముస్లిం వర్గంపై జరుగుతున్న దాడుల నుంచి తప్పించుకునేందుకు ఆలం కుటుంబం పడవలో బంగ్లాదేశ్‌కు బయలు దేరడానికి సిద్దమైంది. విషయం తెలుసుకున్న మయన్మార్ పోలీసులు అక్కడికి చేరుకుని కాల్పులు ప్రారంభించారు. బోటు నడిపేవారు కాల్పులనుంచి తప్పించుకునే తొందరలో శరణార్థులందరినీ ఎక్కించుకుని బయల్ధేరారు. పరిమితికి మించిన బరువుతో బయల్ధేరిన పడవ గమ్యం చేరకముందే నాఫ్ నదిలో మునిగిపోయింది. 16 నెలల షొహాయత, అతడి తల్లి, మేనమామ, మూడేళ్ళ సోదరుడు ఈ ప్రమాదంలో అసువులు బాశారు. షొహాయత శరీరం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. కన్నబిడ్డలు, భార్య కళ్ళముందే విగతజీవులుగా పడివుండడాన్ని జీర్ణించుకోలేక ఆ కన్న తండ్రి హృదయవిదారకంగా రోదిస్తున్నాడు. నేను మాత్రం ఎందుకు బతికి అని రోదిస్తున్నాడు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్‌లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









