మానవ రవాణాపై 90 శాతం పైగా దుబాయ్ నివాసితులకు అవగాహన
- January 07, 2017
దుబాయ్ : మానవ రవాణా వివిధ రకాల తీరు గురించి చాలా పెద్ద మెజారిటీలో దుబాయ్ నివాసితులలో 94 శాతం మందికి పూర్తిగా లేదా పాక్షికంగా తెలుసునాని మరియు 79 శాతం మందికి ఆయా నేరాలపై పోరాడటానికి యుఎఇకి చెందిన చట్టాల గురించి పూర్తిగా అవగాహన ఉందని ఒక సర్వేలో వెల్లడైంది..అద్దర్ పరిశోధన మరియు పోల్ సెంటర్ సహకారంతో దుబాయ్ పోలీసులు నిర్వహించిన ఈ సర్వేలో, గతంలో జరిగిన ఘటనల గూర్చి మరియు మానవ రవాణా గూర్చి అవగాహనను ప్రజలు కల్గి ఉన్నారని అవసరమైతే ఏ స్థాయిలో నైనా పోరాటం జరిపి మానవ రవాణా జరగని రాష్ట్రంగా నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో దుబాయ్ నివాసితులు ఉన్నట్లు సర్వే వెల్లడించింది.దుబాయ్ పోలీసు మరియు జనరల్ సెక్యూరిటీ డిప్యూటీ చైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ దాహి ఖలీఫాన్ తమీమ్, డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ డాక్టర్ మహమ్మద్ అల్ ముర్, దుబాయ్ పోలీస్ నుండి సర్వే నివేదికను అందుకున్నారు.ఈ అధ్యయనం దుబాయ్ లోని సమాజంలోని పలు విభాగాలను సందర్శించి వివరాలు రాబట్టేరని జనరల్ డాక్టర్ అల్ మోర్ చెప్పారు. ఈ సర్వే ను ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగంకు చెందిన ఉద్యోగులతో సహా అనేక రంగాల నుంచి 1,597 మందిని క్రమ రహితంగా ఎంచుకున్న నమూనాని స్పృశించారని తెలిపారు.
ఈ సర్వే నిర్వహించిన వారిలో 51 శాతం మంది సభ్యులు దుబాయ్ లో సాధారణ ప్రజలని, 18 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగుల గాని లేదా పౌర సమాజంతో అనుసంధానమైనవారని మరియు 31 శాతం మంది ప్రైవేట్ రంగంకు చెందినవారు ఉన్నారు.
తాజా వార్తలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ
- ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం..11 మంది మృతి







