సినాయ్ లో ఉగ్రవాదుల ట్రక్ దాడి, 9 మంది పోలీసులు మృతి

- January 09, 2017 , by Maagulf
సినాయ్ లో ఉగ్రవాదుల ట్రక్ దాడి, 9 మంది పోలీసులు మృతి

ఈజిప్టు సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఉత్తర సినాయ్ గవర్నరేట్‌లో చెత్త సేకరించే ట్రక్కులో పేలుడు పదార్థాలు ఉంచి దానితో సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో కనీసం 9 మంది పోలీసులు మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. చెక్‌పాయింట్‌లోకి ట్రక్కుతో దూసుకుపోతూ ఉగ్రవాదులు కాల్పులు కూడా జరిపినట్టు పేర్కొన్నారు. అయితే ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. గాయపడిన 14 మందిలో నలుగురు పౌరులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. 2011 నుంచి ఇక్కడ ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడతున్నారు. తాజా దాడిలో 9 మంది పోలీసులు చనిపోయినట్టు చెబుతున్న కచ్చితమైన సంఖ్యను పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com