ఫోర్జరీ కేసులో షాప్ ఓనర్ అరెస్ట్
- January 09, 2017
మనామా: స్టేషనరీ షాప్ ఓనర్ ఒకరు, ఫోర్జరీ డాక్యుమెంట్లను డబ్బు కోసం వినియోగదారులకు విక్రయిస్తుండగా అండర్ కవర్ ఏజెంట్ ద్వారా ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. సిక్ లీవ్ డాక్యుమెంట్లు, సేలరీ స్లిప్స్ ఇంకొన్ని ఇతర డాక్యుమెంట్లను బ్యాంకు లోన్ల కోసం, మినిస్ట్రీ సీల్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ కోసం విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. కొంతకాలంగా జరుగుతున్న ఈ తంతు గురించి 'టిప్' అందుకున్న యాంటీ కర్ప్షన్ జనరల్ డైరెక్టరేట్, అలాగే ఎకనమిక్ మరియు ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ వర్గాలు వ్యూహాత్మకంగా వ్యవహరించి, నిందితుడ్ని ఉచ్చులో బిగించాయి. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. అతనికి చాలా మంది బహ్రెయినీ క్లయింట్స్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. కుటుంబ పోషణ కోసం తగినంత ఆర్జన తనకు లేకపోవడంతో అడ్డదారులు తొక్కినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి నిందితుడ్ని రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







