8వ కార్ ఫ్రీ డే ఇనీషియేటివ్ ఫిబ్రవరి 5న
- January 09, 2017
దుబాయ్ మునిసిపాలిటీ ఆదివారం, ఎనిమిదవ కార్ ఫ్రీ డే ఇనీషియేటివ్‌ని చేపట్టనుంది. మునిసిపాలిటీ హెడ్ క్వార్టర్స్‌లో ఈ విషయాన్ని దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నాజర్ లూటా మరికొందరు అధికారులతో కలిసి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుండడంతో, ఇంకా ఉత్సాహంగా కార్ ఫ్రీ డే ఇనీషియేటివ్‌కి ప్రాచుర్యం కల్పించాలనుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికి ఏడుసార్లు ఈ కార్యక్రమం జరిగింది. పబ్లిక్, ప్రైవేట్ వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. పీల్చే గాలి నాణ్యతను పెంచడంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేపట్టవలసిన అవసరం ఉందని, అలాగే సైక్లింగ్ వంటి కార్యకలాపాలతో శరీరానికి తగిన వ్యాయామం కూడా దొరుకుతుందని అధికారులు చెప్పారు. విజన్ 2021లో భాగంగా ఈ కార్యక్రమాలు చేపడ్తున్నట్లు వారు వివరించారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







