భారత్‌ కెప్టెన్‌గా చివరి మ్యాచ్ ఆడనున్న ధోని....

- January 09, 2017 , by Maagulf
భారత్‌ కెప్టెన్‌గా చివరి మ్యాచ్ ఆడనున్న ధోని....

ముంబై: భారత్-ఇంగ్లండ్‌ జట్లమధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌కు రంగం సిద్ధమవుతోంది. అందుకోసం ఇరు జట్లూ రెడీ అవుతున్నాయి. ఈనెల 15న మొదలయ్యే వన్డే సిరీస్‌కు సన్నాహకంగా భారత్-ఎ, ఇంగ్లండ్‌ లెవెన్‌ జట్లు రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లకూ ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియం వేదిక కానుంది. మంగళవారం జరిగే తొలి డే/నైట్‌ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ, గురువారం జరిగే డే మ్యాచ్‌లో అజింక్యా రహానె భారత-ఎను నడిపించనున్నారు. కాగా.. ఇయాన్‌ మోర్గాన్‌ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ ఈ వామప్‌ బరిలోకి దిగుతోంది. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ వదులుకున్న తర్వాత ధోనీ ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే కావడంతో అతనేం చేస్తాడోనని ఆసక్తి నెలకొంది.
మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకొచ్చిన యువరాజ్‌ సింగ్‌, గాయాల నుంచి కోలుకున్న శిఖర్‌ ధవన్‌, ఆశీష్‌ నెహ్రా, హార్దిక్‌ పాండ్యాలకు కూడా ఇది మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కానుంది. దీంతో ధోనీతోపాటు యువీ, ధవన్‌, నెహ్రాపై అందరి దృష్టీ నెలకొంది. కాగా.. టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం పాలైన ఇంగ్లండ్‌..
పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనైనా పుంజుకోవాలని యోచిస్తోంది. ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రాణించి వన్డే సిరీస్‌ ఆరంభానికి ముందు భారత్‌కు గట్టి హెచ్చరికలు పంపాలని భావిస్తోంది. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌తోపాటు, జానీ బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌, మొయిన్‌ అలీపై ఆ జట్టు భారీగా అంచనాలు పెట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com