విస్తారా డిస్కౌంట్ ఆఫర్
- January 10, 2017
ప్రముఖ విమానయాన సంస్థ 'విస్తారా' తాజాగా తన రెండవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. సంస్థ ఇందులో భాగంగా ఎకానమీ తరగతి ప్రయాణానికి సంబంధించిన టికెట్లను రూ.899ల ప్రారంభ ధరతో ప్రయాణికులకు అందిస్తోంది. నేటి నుంచి జనవరి 12 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు జనవరి 25 నుంచి అక్టోబర్ 1 వరకు ఉన్న మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చని విస్తారా వివరించింది. ఈ పరిమిత కాల ఆఫర్ కేవలం దేశీ నెట్వర్క్కు మాత్రమే వరిస్తుందని పేర్కొంది. సంస్థ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకునే కస్టమర్లు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్స్ను పొందొచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







